రాఘవేంద్ర రాఘవేంద్ర

758 Words
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయనమః, అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి, నానావిధ పరిమళపత్ర పుష్పాణి పూజయామి. సర్వ భక్తజనుల మనోభీష్టములు తీర్చువారు, సర్వశక్తి స్వరూపులు, సద్గురురుమూర్తులు, శ్రీ సచ్చిదానందులు "రాఘవేంద్ర, రాఘవేంద్ర"యని ప్రేమాతిశయమున భక్త్యావేశములతో స్మరించిన క్షణమున చిన్ముద్రలతో, దండకమండలాది కాషాయాంబరముల బంగారు వర్ణదేహముతో, వూర్థ్వపుండ్రములు, తులసిమాల, అక్షమాలలు ధరించి, సర్వకార్యములు తీర్చి, దేశకాల, మత, కులగోత్ర జాతిభేదాలను తలంచక, తలచినవారిని శరణన్న క్షణాన కరుణించి శరణొసగే ఆ దివ్యమూర్తి. శ్రీ హంసనామక పరమాత్మ, అందుండి చతుర్ముఖబ్రహ్మ, అక్కడ నుండి సనక, సనంద, సనత్కుమార, సనాతన, దుర్వాస, జ్ఞాననిది, గరుత్మంత, కైవల్య, జ్ఞానేశ, పర, సత్యప్రజ, ప్రజా, అచ్యుతాది యోగీంద్ర తీర్థవర్యులు ప్రభవించారు. ఇది సృష్టి క్రమంలోనీ తీర్థంకరుల ఆవిర్భావం. శ్రీ మధ్వమహాపీఠ పరంపర: "శ్రీవాయు, భీమాంశలలో" ప్రభవించిన శ్రీమధ్వాచార్యులవారు మహామాధ్వాపీఠానికి మూలపురుషులు. వారి పరంపరలో శ్రీశ్రీశ్రీ పద్మనాభులు, నరహరి, మాధవ, శ్రీ మదక్షోభులు, శ్రీ జయతీర్థులు. (వీరికే "మట్టికా చార్యుల"నే నామాంతరముంది) విద్యాది రాజతీర్థులు, కవీంద్రులు, వాగేశ, రామచంద్ర, విభుధేంద్ర, జితామిత్ర, రఘునందన, సురేంద్ర, విజయేంద్ర, సుధీంద్రతీర్థులువారు. Hide quoted text శ్రీ మధ్వమహాపీఠ పరంపర: శ్రీశ్రీశ్రీ సుధీంద్రతీర్థులవారి సమయంలోనే శ్రీ వేంకటేశ్వరుని వరప్రసాదంగా, ప్రహ్లాదాంశులైన శ్రీ వెంకన్నభట్టు జననం. వీరే పరమ హంసాశ్రమమొంది "శ్రీ రాఘవేంద్ర తీర్థులని" విశ్వవిఖ్యాతులయ్యారు. లోకానుగ్రహభారం వీరిభుజస్కంధాలపై పడగా బృందావన స్థితులై ఏడువందల సంవత్సరములు భక్తజన రక్షణం గావిస్తామని ప్రతిజ్ఞ చేసి, పరమ పుణ్య "మంత్రాలయం"లో బృందావనమొందారు. శ్రీ మధ్వమహాపీఠ పరంపర: శ్రీ రాఘవేంద్ర తీర్థుల పరంపరలో శ్రీశ్రీశ్రీ యోగీంద్రులు, సురేంద్రులు, సుమతీంద్రులు, ఉపేంద్రులు, వాదీంద్రులు, వసుధేంద్రులు, వరదేంద్రులు, ధీరేంద్రులు, భువనేంద్రులు, సుభోదేంద్రులు, సుజనేంద్రులు.... సుజ్ఞానేంద్రులు, సుధమేంద్రులు, సుగుణేంద్రులు సుప్రజ్ఞేంద్రులు, సుకృతేంద్రులు, సుశీలేంద్రులు, సువ్రతేంద్రులు, శ్రీ సుయమీంద్రులు, శ్రీ సుజయీంద్రులు .....పీఠాధిపతులయ్యారు. శ్రీ మధ్వమహాపీఠ పరంపర: ప్రస్తుతం ... శ్రీశ్రీశ్రీ సుషమీంద్ర తీర్థులవారు ... శ్రీ మంత్రాలయ క్షేత్రమును ... సర్వభక్తజన మనోరంజకముగా నడిపించుతున్నారు. మంత్రాలయ యతీంద్రులై, మహామంత్ర శక్తి సమన్వితులై, మన జన్మ జన్మల కర్మల పుణ్య విశేషాన, నిత్యం ఆ పరబ్రహ్మను సేవించుకుంటూ తరించే మహాభక్తుడు శంకకర్ణుడు. లోకకల్యాణ కాంక్ష నిమిత్తం సర్వేశ్వరుడైన శ్రీహరి మానసిక ప్రేరణ మేరకు ఈ భూమిలో వివిధ అవతారాలు ఎత్తాడు. ఆ దివ్యచరిత లీలావిభాగంలోని మధుమకరందమాధుర్యమే ఈ గురు రాఘవేంద్రస్వామి జీవిత చరిత్రము. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పనే చెప్పారు. అధర్మం పెరిగిపోయినపుడు దుష్ట సాంప్రదాయాలు పెరిగి, మంచికి ప్రమాదమేర్పడి, చెడు అప్రతిహాసముగా సాగే సమయంలో తాను తప్పక అవతరిస్తానని ధర్మరక్షణం, భక్తజన సంరక్షణం గావిస్తానని. ఆ పరమాత్మ తన పలుకులను ఎపుడు సత్యవంతం గావించుకుంటూనే వున్నారు. సత్యపధంలో నడువమనీ సత్యమే సర్వేశ్వరుడనీ, అసత్యసాంప్రదాయం ప్రమాదహేతువనీ మనం ప్రేమించి, పూజించి, రక్షించిన ధర్మమే మనల్ని సర్వదా రక్షించి కాపాడుతుందని, అందుకోసం తాను ఎన్ని జన్మలనైనా ఎత్తుతానని, ఎన్ని బాధలైనా పొందుతాననీ కేవలం మాటలలో చెప్పడమే కాకుండా, సమయసందర్భాలననుసరించి తానుగా కొన్నిసమయాలలో, మహాభక్తమూర్తులుగా మరికొన్ని సమయాలలో అవతరించి, తన ధర్మ సత్యదీక్షా కార్యక్రమాన్ని భక్తజనమనోరంజకంగా సాగిస్తున్నారు. శ్రీ సద్గురు రాఘవేంద్రస్వామి జీవిత చరిత్ర: అవతార ప్రదర్శన అన్ని సమయాలలోను అవసరముండదు. కనుక సమయసందర్భాలు, కాలమాన పరిస్థితులనుబట్టి స్వామి తన అవతరణ కార్యక్రమాన్ని నిర్దేశించుకుంటారు. తానుగా అవతరించవచ్చును. లేదా తన భక్తజనుల రూపంలో తన దివ్యలీలా విలాసాన్ని జరిపించవచ్చును. ఎన్నో సందర్భాలలో ఎన్నో రకాలుగా తన లీలా విలాస కార్యక్రమాన్ని ప్రదర్శించే ఆ పరమాత్మ క్రీస్తు శకం 1621, దుర్మతినామ సంవత్సర ఫాల్గుణశుద్ధ విదియనాడు శ్రీ సుధీంద్రతీర్థయతీంద్రులచే, శ్రీ వేంకటేశ్వర ప్రసాదియై, కారణజన్మునిగా జన్మించిన, శ్రీ సుధీంద్రతీర్థులచే బాల్యమునే "శ్యామ సుందరుడని" ముద్దుగా పిలువబడిన శ్రీ వేంకటనాధాచార్యులకు యత్యాశ్రమము నొసగి శ్రీమధ్వాచార్య పరంపరగతాచారము ప్రకారము శ్రీ రాఘవేంద్రతీర్థులని Hide quoted text ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయనమః, అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి, నానావిధ పరిమళపత్ర పుష్పాణి పూజయామి. సర్వ భక్తజనుల మనోభీష్టములు తీర్చువారు, సర్వశక్తి స్వరూపులు, సద్గురురుమూర్తులు, శ్రీ సచ్చిదానందులు "రాఘవేంద్ర, రాఘవేంద్ర"యని ప్రేమాతిశయమున భక్త్యావేశములతో స్మరించిన క్షణమున చిన్ముద్రలతో, దండకమండలాది కాషాయాంబరముల బంగారు వర్ణదేహముతో, వూర్థ్వపుండ్రములు, తులసిమాల, అక్షమాలలు ధరించి, సర్వకార్యములు తీర్చి, దేశకాల, మత, కులగోత్ర జాతిభేదాలను తలంచక, తలచినవారిని శరణన్న క్షణాన కరుణించి శరణొసగే ఆ దివ్యమూర్తి. శ్రీ హంసనామక పరమాత్మ, అందుండి చతుర్ముఖబ్రహ్మ, అక్కడ నుండి సనక, సనంద, సనత్కుమార, సనాతన, దుర్వాస, జ్ఞాననిది, గరుత్మంత, కైవల్య, జ్ఞానేశ, పర, సత్యప్రజ, ప్రజా, అచ్యుతాది యోగీంద్ర తీర్థవర్యులు ప్రభవించారు. ఇది సృష్టి క్రమంలోనీ తీర్థంకరుల ఆవిర్భావం. శ్రీ మధ్వమహాపీఠ పరంపర: "శ్రీవాయు, భీమాంశలలో" ప్రభవించిన శ్రీమధ్వాచార్యులవారు మహామాధ్వాపీఠానికి మూలపురుషులు. వారి పరంపరలో శ్రీశ్రీశ్రీ పద్మనాభులు, నరహరి, మాధవ, శ్రీ మదక్షోభులు, శ్రీ జయతీర్థులు. (వీరికే "మట్టికా చార్యుల"నే నామాంతరముంది) విద్యాది రాజతీర్థులు, కవీంద్రులు, వాగేశ, రామచంద్ర, విభుధేంద్ర, జితామిత్ర, రఘునందన, సురేంద్ర, విజయేంద్ర, సుధీంద్రతీర్థులువారు. శ్రీ మధ్వమహాపీఠ పరంపర: శ్రీశ్రీశ్రీ సుధీంద్రతీర్థులవారి సమయంలోనే శ్రీ వేంకటేశ్వరుని వరప్రసాదంగా, ప్రహ్లాదాంశులైన శ్రీ వెంకన్నభట్టు జననం. వీరే పరమ హంసాశ్రమమొంది "శ్రీ రాఘవేంద్ర తీర్థులని" విశ్వవిఖ్యాతులయ్యారు. లోకానుగ్రహభారం వీరిభుజస్కంధాలపై పడగా బృందావన స్థితులై ఏడువందల సంవత్సరములు భక్తజన రక్షణం గావిస్తామని ప్రతిజ్ఞ చేసి, పరమ పుణ్య "మంత్రాలయం"లో బృందావనమొందారు. శ్రీ మధ్వమహాపీఠ పరంపర: శ్రీ రాఘవేంద్ర తీర్థుల పరంపరలో శ్రీశ్రీశ్రీ యోగీంద్రులు, సురేంద్రులు, సుమతీంద్రులు, ఉపేంద్రులు, వాదీంద్రులు, వసుధేంద్రులు, వరదేంద్రులు, ధీరేంద్రులు, భువనేంద్రులు, సుభోదేంద్రులు, సుజనేంద్రులు.... సుజ్ఞానేంద్రులు, సుధమేంద్రులు, సుగుణేంద్రులు సుప్రజ్ఞేంద్రులు, సుకృతేంద్రులు, సుశీలేంద్రులు, సువ్రతేంద్రులు, శ్రీ సుయమీంద్రులు, శ్రీ సుజయీంద్రులు .....పీఠాధిపతులయ్యారు. శ్రీ మధ్వమహాపీఠ పరంపర: ప్రస్తుతం ... శ్రీశ్రీశ్రీ సుషమీంద్ర తీర్థులవారు ... శ్రీ మంత్రాలయ క్షేత్రమును ... సర్వభక్తజన మనోరంజకముగా నడిపించుతున్నారు. మంత్రాలయ యతీంద్రులై, మహామంత్ర శక్తి సమన్వితులై, మన జన్మ జన్మల కర్మల పుణ్య విశేషాన, నిత్యం ఆ పరబ్రహ్మను సేవించుకుంటూ తరించే మహాభక్తుడు శంకకర్ణుడు. లోకకల్యాణ కాంక్ష నిమిత్తం సర్వేశ్వరుడైన శ్రీహరి మానసిక ప్రేరణ మేరకు ఈ భూమిలో వివిధ అవతారాలు ఎత్తాడు. ఆ దివ్యచరిత లీలావిభాగంలోని మధుమకరందమాధుర్యమే ఈ గురు రాఘవేంద్రస్వామి జీవిత చరిత్రము. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పనే చెప్పారు. అధర్మం పెరిగిపోయినపుడు దుష్ట సాంప్రదాయాలు పెరిగి, మంచికి ప్రమాదమేర్పడి, చెడు అప్రతిహాసముగా సాగే సమయంలో తాను తప్పక అవతరిస్తానని ధర్మరక్షణం, భక్తజన సంరక్షణం గావిస్తానని. ఆ పరమాత్మ తన పలుకులను ఎపుడు సత్యవంతం గావించుకుంటూనే వున్నారు. సత్యపధంలో నడువమనీ సత్యమే సర్వేశ్వరుడనీ, అసత్యసాంప్రదాయం ప్రమాదహేతువనీ మనం ప్రేమించి, పూజించి, రక్షించిన ధర్మమే మనల్ని సర్వదా రక్షించి కాపాడుతుందని, అందుకోసం తాను ఎన్ని జన్మలనైనా ఎత్తుతానని, ఎన్ని బాధలైనా పొందుతాననీ కేవలం మాటలలో చెప్పడమే కాకుండా, సమయసందర్భాలననుసరించి తానుగా కొన్నిసమయాలలో, మహాభక్తమూర్తులుగా మరికొన్ని సమయాలలో అవతరించి, తన ధర్మ సత్యదీక్షా కార్యక్రమాన్ని భక్తజనమనోరంజకంగా సాగిస్తున్నారు. శ్రీ సద్గురు రాఘవేంద్రస్వామి జీవిత చరిత్ర: అవతార ప్రదర్శన అన్ని సమయాలలోను అవసరముండదు. కనుక సమయసందర్భాలు, కాలమాన పరిస్థితులనుబట్టి స్వామి తన అవతరణ కార్యక్రమాన్ని నిర్దేశించుకుంటారు. తానుగా అవతరించవచ్చును. లేదా తన భక్తజనుల రూపంలో తన దివ్యలీలా విలాసాన్ని జరిపించవచ్చును. ఎన్నో సందర్భాలలో ఎన్నో రకాలుగా తన లీలా విలాస కార్యక్రమాన్ని ప్రదర్శించే ఆ పరమాత్మ క్రీస్తు శకం 1621, దుర్మతినామ సంవత్సర ఫాల్గుణశుద్ధ విదియనాడు శ్రీ సుధీంద్రతీర్థయతీంద్రులచే, శ్రీ వేంకటేశ్వర ప్రసాదియై, కారణజన్మునిగా జన్మించిన, శ్రీ సుధీంద్రతీర్థులచే బాల్యమునే "శ్యామ సుందరుడని" ముద్దుగా పిలువబడిన శ్రీ వేంకటనాధాచార్యులకు యత్యాశ్రమము నొసగి శ్రీమధ్వాచార్య పరంపరగతాచారము ప్రకారము శ్రీ రాఘవేంద్రతీర్థులని
Free reading for new users
Scan code to download app
Facebookexpand_more
  • author-avatar
    Writer
  • chap_listContents
  • likeADD